MNCL: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన విబిజి రాంజీ చట్టం ద్వారా జన్నారం మండలంలోని కూలీలకు ఉపాధి కల్పించడం జరుగుతుందని ఈజీఎస్ మండల ఏపీవో రవీందర్ తెలిపారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాలలో పెండింగ్ ఉపాధి పనులను గుర్తించి వాటిని పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. వర్షాకాలంలో 2 నెలల పాటు ఉపాధి పనులను నిలిపివేస్తామన్నారు.