SRPT: అనంతగిరి మండలం వాయిల సింగారం గ్రామానికి చెందిన కార్తీక్ రాజ్ జాతీయ స్థాయిలో తన ప్రతిభ చాటారు. ముంబైలో నిర్వహించిన మాస్టర్ ఆర్ట్ కాంపిటీషలో కార్తీక్ రాజ్ బంగారు పతకం సాధించడమే కాకుండా, అంతర్జాతీయ సాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా గురువారం గ్రామంలో గ్రామస్తులు కార్తీక్ రాజ్‌ను ఘనంగా సన్మానించారు.