WNP: అమరచింత మున్సిపాలిటీ ఓటరు జాబితాను కమిషనర్ నాగరాజు గురువారం విడుదల చేశారు. పట్టణంలోని మొత్తం 10 వార్డుల గాను 18 పోలింగ్ స్టేషన్లు ఉన్నట్లు పేర్కొన్నారు. మొత్తం 9,217 ఓటర్లు కాగా అందులో పురుషులు 4,404, స్త్రీలు 4,813 ఉన్నారు. ఈరోజు నుంచి ఈనెల 9 వరకు ఓటరు జాబితాపై అభ్యంతరాలు ఉంటే రాజకీయ పార్టీల నాయకులు తమ దృష్టికి తీసుకురావచ్చని కమిషనర్ తెలిపారు.