GNTR: గుంటూరు న్యూ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల ఇబ్బందులను తొలగించేందుకు ఉన్నతాధికారులు రూ. 4.68 కోట్లు మంజూరు చేశారు. నిత్యం 90 రైళ్లు, 10 వేల మంది ప్రయాణికులతో రద్దీగా ఉండే ఈ స్టేషన్ను, ఈ నిధులతో ప్లాట్ఫామ్స్ విస్తరణ, మౌలిక సదుపాయాలను మెరుగుపరచనున్నారు. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా స్టేషన్ను ఆధునీకరించడమే ఈ నిధుల ప్రధాన లక్ష్యం.