NDL: నంద్యాల జిల్లా శ్రీశైలంలో చిరుతపులి కలకలం సృష్టించింది. అర్ధరాత్రి పాతాళగంగ మెట్ల మార్గంలోని ఓ ఇంటి ప్రాంగణంలో చిరుత సంచరించిన ఘటన చోటుచేసుకుంది. ఈ దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆలయ ఈవో శ్రీనివాసరావు, సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. పాతాళగంగకు పుణ్యస్నానాలకు వెళ్లే భక్తులు, స్థానికులు అత్యంత జాగ్రత్తలు పాటించాలని అధికారులు మైకుల ద్వారా అనౌన్స్ చేస్తున్నారు.