W.G: నరసాపురం టీడీపీ కార్యాలయంలో శుక్రవారం యథావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ పొత్తూరి రామరాజు వెల్లడించారు. ఉదయం 9 గం. నుంచి ప్రజలు తమ సమస్యలపై ఆర్జీలు అందజేయవచ్చని తెలిపారు. సమస్యల తక్షణ పరిష్కారమే లక్ష్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.