GDWL: మల్దకల్ మండలంలో యాసంగి సీజన్‌కు సరిపడా యూరియా, ఇతర ఎరువులు ఉన్నాయి అని మండల వ్యవసాయ అధికారి కే రాజశేఖర్ తెలిపారు. గురువారం మల్దకల్ మండల కేంద్రంలోని పీఏసీఎస్, ప్రైవేటు ఎరువుల దుకాణాలను ఆయన తనిఖీ చేశారు. ఏవో మాట్లాడుతూ.. రైతులు ఆందోళన చెందకుండా ఈ-పాస్ మిషన్ల ద్వారానే ఎరువులు కొనుగోలు చెయ్యాలన్నారు.