AP: పుస్తక ప్రియులకు గుడ్ న్యూస్. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం వేదికగా 36వ బుక్ ఫెస్టివల్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 12 వరకు రోజు మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు ఇది కొనసాగుతుంది. దాదాపు 300 స్టాళ్లలో వేల పుస్తకాలు కొలువుదీరనుండగా.. ప్రతీ పుస్తకంపై 10% రాయితీ ఇస్తున్నారు. ఈ ఉత్సవానికి 6న సీఎం చంద్రబాబు, 9న డిప్యూటీ సీఎం పవన్ హాజరయ్యే అవకాశం ఉంది.