KRNL: ఒడిశా రాష్ట్రానికి చెందిన సుహాసిని (25) గురువారం ఆదోనిలో మృతి చెందింది. భర్త ఈశ్వర్ మహానంద్తో కలిసి ఆదోని మండలం ఆరేకల్లు సమీపంలోని ఇటుకల ఫ్యాక్టరీలో కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త ఇంట్లో లేని సమయంలో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఘటనపై తాలూక ఎస్సై రామాంజనేయులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.