TG: జర్నలిస్టుల అక్రెడిటేషన్ సమస్యపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని మాజీమంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. TUWJ ప్రతినిధులు ఆయనను కలిసి, జీవో 252 వల్ల 13 వేల మంది కార్డులు కోల్పోయే ప్రమాదం ఉందని వివరించారు. దీనిపై స్పందించిన హరీష్.. డెస్క్, రిపోర్టర్ల మధ్య చిచ్చు పెట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పాత జీవో 239 ప్రకారమే కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.