AP: అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ, టీడీపీ నేతలు, కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. యల్లనూరులో న్యూఇయర్ వేడుకలు జరుపుకుంటున్న నేపథ్యంలో రెండు వర్గాల మధ్య వివాదం నెలకొంది. దీంతో పరస్పరం కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో వైసీపీ జెడ్పీటీసీ బోగాతి ప్రతాప్ రెడ్డి సహా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.