HYD: నగరంలో నూతన సంవత్సర వేడుకలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయని వీసీ సజ్జనార్ తెలిపారు. పోలీసుల కఠిన నిబంధనలు, విస్తృతమైన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, ప్రజల సహకారంతో ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ సజ్జనార్ ట్వీట్ చేశారు.