W.G: నరసాపురం మండలం తూర్పుతాళ్ళు గ్రామంలో పరిధి కర్రింశెట్టి వారి పాలెం శివారులో నిన్న రాత్రి పోలీసులు కోడి పందాల స్థావరంపై దాడి చేసి నలుగురుని అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 1,050, ఒక కోడి పుంజు, ఒక కోడి కత్తి, నాలుగు సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ వాసు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.