TG: నూతన సంవత్సరం సందర్బంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే మంత్రి శ్రీధర్ బాబు కూడా శ్రీవారి సేవలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ప్రజలంతా సంతోషంగా ఉండాలని దేవున్ని ప్రార్ధించినట్లు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఏ ఆటంకం లేకుండా కొనసాగలని కోరుకున్నట్లు వెల్లడించారు.