ప్రకాశం: పామూరు మండలం పోలీస్ స్టేషన్ ఎస్ఐగా అనుక్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న ఎస్ఐ సాధారణ బదిలీలలో భాగంగా ఒంగోలుకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతల అదుపునకు కృషి చేస్తానని చెప్పారు. అనంతరం కార్యాలయ సిబ్బంది ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.