ATP: టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో నిరాహార దీక్ష మొదలు పెట్టారు. ఆయన మాట్లాడుతూ.. తన ప్రవర్తనపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, అసలు తాను అలా ఎందుకు ప్రవర్తించాల్సి వస్తుందో వివరించేందుకే ఈ దీక్షకు దిగానని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడి తనపై మీ అభిప్రాయం చెప్పండి అంటూ కోరుతున్నారు.