WGL: నర్సంపేట (M) కేంద్రంలోని ఇటుకలపల్లి గ్రామంలో నూతన సంవత్సరం సందర్భంగా గ్రామ దేవతకు గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మెరుగు సుమలత శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా జీవించాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు.