SRD: ఆంగ్ల నూతన సంవత్సరం పురస్కరించుకుని ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారంలో గల గణేష్ గడ్డ శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గురువారం దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశీస్సులు తీసుకున్నారు. ప్రజలందరి సహకారంతో పటాన్ చెరు నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు.