MDK: జిల్లాలో ఈ రోజు ఉదయం భారీగా పొగమంచు కమ్ముకుంది. పొగమంచు కారణంగా ప్రధాన రహదారులు, జాతీయ రహదారులపై దృశ్యమానత గణనీయంగా తగ్గిందని, ఈ నేపథ్యంలో వాహనదారులు అత్యంత అప్రమత్తంగా ప్రయాణించాలని జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు సూచించారు. పొగమంచు ఉన్న సమయంలో వేగం తగ్గించి, హెడ్లైట్లు ఆన్ చేసి, ముందు వాహనాల మధ్య తగినంత దూరం పాటించాలని తెలిపారు.