దేశ ప్రజలకు ప్రధాని మోదీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026వ సంవత్సరం ప్రతి ఒక్కరికీ అద్భుతంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కొత్త ఏడాదిలో ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, శ్రేయస్సు కలగాలని కోరుకున్నారు. ప్రతి ఒక్కరూ చేసే పనుల్లో గొప్ప విజయాలు సాధించాలని, సమాజంలో శాంతి, ఆనందం వెల్లివిరియాలని ప్రధాని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు.