NGKL: డిండి ఎత్తిపోతల పథకం ప్యాకేజీ-1, 2 రిజర్వాయర్ల భూసేకరణ, పునరావాస (R&R) పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం కల్వకుర్తి ఆర్డీవో కార్యాలయంలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పరిష్కరించి ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.