NGKL: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎస్పీ ఆదేశాల మేరకు బుధవారం రాత్రి మండలవ్యాప్తంగా విస్తృత వాహన తనిఖీలు నిర్వహిస్తామని ఎస్సై కృష్ణదేవ తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపినవారిపై, మైనర్లకు వాహనాలు ఇచ్చినవారిపై కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తారని హెచ్చరించారు. యువత శాంతియుత వేడుకలకు, వేగాన్ని తగ్గించాలని సూచించారు.