ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డామియన్ మార్టిన్(54) ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. తీవ్ర అనారోగ్యానికి గురైన మార్టిన్ ప్రస్తుతం కోమాలో ఉన్నట్లు సమాచారం. మెనింజిటిస్ వ్యాధితో బాధపడుతున్న అతను చికిత్స పొందుతున్నాడు. ఈ విషయాన్ని అతడి సహచరుడు డారెన్ లేమన్ వెల్లడించాడు. మార్టిన్ తన క్రికెట్ కెరీర్లో 67 టెస్ట్ మ్యాచ్లు, 208 వన్డేలు ఆడాడు.