KMM: జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డుల విషయంలో, కొత్త మార్గదర్శకాలతో ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీవో 252లో కొన్ని సవరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) కోరింది. రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీ నేతృత్వంలో యూనియన్ ప్రతినిధి బృందం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో చర్చించి వినతిపత్రం అందజేశారు.