KRNL: జిల్లా ఎస్పీగా 10 నెలల కాలంలో తనదైన ముద్ర వేసిన విక్రాంత్ పాటిల్, డీఐజీగా పదోన్నతి పొందారు. ఫిబ్రవరిలో బాధ్యతలు చేపట్టిన ఆయన సైబర్ నేరాలు, గంజాయి విక్రయాలు, ఈవ్‌టీజింగ్ పై ఉక్కుపాదం మోపారు. హెల్మెట్ ధారణ, డ్రంక్ అండ్ డ్రైవ్‌పై అవగాహన కల్పిస్తూ నేరాల శాతాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషించారు. త్వరలోనే కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు.