TG: వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ఫేస్బుక్ అకౌంట్‌ను కొందరు కేటుగాళ్లు హ్యాక్ చేశారు. ఆ తర్వాత డబ్బులు కావాలని ఎమ్మెల్యే పేరుతో పలువురికి మెసేజ్‌లు పంపించారు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అప్రమత్తమయ్యారు. తన పేరుతో ఎవరు మెసేజ్ చేసినా స్పందించొద్దని విజ్ఞప్తి చేశారు.