శ్రీలంకతో చివరి టీ20 మ్యాచ్ అనంతరం టీమిండియా ఆల్రౌండర్ దీప్తి శర్మ కీలక వ్యాఖ్యలు చేసింది. టీ20 ప్రపంచకప్ ఇంకా సుదూర లక్ష్యమేనని తెలిపింది. జట్టుకు ప్రయోజనకరమైన ఆటతీరును కనబర్చేందుకే ఎప్పుడూ ప్రయత్నిస్తానని వెల్లడించింది. వన్డే విజయం జోష్ శ్రీలంక సిరీస్లో ప్రతిబింబించిందని పేర్కొంది. ఈ విజయం ఉత్సాహం టీ20 ప్రపంచకప్లో కనిపించాలని ఆశాభావం వ్యక్తం చేసింది.