దేశ రాజధాని ఢిల్లీకి వాతావరణ శాఖ అధికారులు మరోసారి రెడ్ అలర్ట్ జారీ చేశారు. వాతావరణం న్యూ ఇయర్ వేడుకలకు అడ్డంకిగా మారింది. ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో విమాన, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పొగమంచు కారణంగా 118 విమానాలను అధికారులు రద్దు చేశారు. విజిబులిటీ జీరో స్థాయికి పడిపోవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.