AP: విద్యుదుత్పత్తికి రూ.6 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. నాణ్యమైన విద్యుత్ దిశగా పెద్ద సబ్ స్టేషన్ల నిర్మాణానికి ఈ నిధులు వెచ్చిస్తామన్నారు. అవసరాలకు తగ్గట్లు కొత్త సబ్ స్టేషన్లు, లైన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. విద్యుత్ ఛార్జీలు ఇంకా పెద్ద ఎత్తున తగ్గించే లక్ష్యంతో 2026లో పనిచేస్తామన్నారు.