ADB: ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ITDA PO, ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మట్ సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిని పీవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిమ్స్‌లోని ఐటీడీఏ వార్డ్‌ను పరిశీలించి గిరిజన గ్రామాల నుంచి వచ్చే రోగుల వివరాలు, అంబులెన్స్ అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. లోపాలు లేకుండా చూడాలన్నారు.