అన్నమయ్య: మనస్థాపంతో మదనపల్లి పట్టణంలోని రామారావు కాలనీకి చెందిన షబరిన్ (39) మంగళవారం రాత్రి చక్కర వ్యాధి మాత్రమే అధిక మోతాదులో మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. షబరిన్ అదే ప్రాంతానికి చెందిన వారి వద్ద రూ. లక్ష అప్పు చేసింది. ఆ డబ్బు ఇవ్వలేదని వారు మందలించడంతో ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.