తమిళనాడులోని కరూర్‌లో SEP 27న తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత, నటుడు విజయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 41 మంది మరణించారు. 50 మంది గాయపడ్డారు. మృతుల్లో 11 మంది చిన్నారులు ఉన్నారు. విజయ్ సభకు జనం భారీగా తరలివచ్చారు. ఊహించిన దానికంటే ఎక్కువ మంది వచ్చారు. అదే సమయంలో ఈ సభకు విజయ్ చాలా ఆలస్యంగా రావడం కూడా ప్రమాదానికి కారణమైంది.