SRCL: ముస్తాబాద్( M) చిప్పలపల్లిలో ఓ రైతు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై గణేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మేరకుపారిపెల్లి సాయిలు (62) అనే వ్యక్తి గత కొంతకాలంగా షుగర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఎన్ని ఆసుపత్రులు తిరిగిన నయం కాకపోవడంతో సోమవారం మధ్యాహ్నం తన వ్యవసాయ పొలం వద్ద ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని భార్య ఇచ్చిన ఫిర్యాదు కేసు నమోదు చేశారు.