BHPL: జిల్లా కేంద్రంలో ఇవాళ ఉ.11 గం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సంక్షేమ పథకాల అమలు తీరు పై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. BHPL, హనుమకొండ, వరంగల్ జిల్లాల అధికారులు ఈ భేటీకి హాజరుకానున్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ పర్యవేక్షణలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎస్సీ డీడీలు, ఐటీడీఏ పీవోలు, గురుకుల ప్రిన్సిపల్స్ పాల్గొని పథకాల ప్రగతి నివేదికలు సమర్పించనున్నారు.