AP: కొత్త ఏడాది ప్రజలందరికీ మంచి జరగాలని సీఎం చంద్రబాబు అన్నారు. ‘ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందుకుంటున్న లక్షలాది మంది లబ్దిదారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త ఏడాది మీకు మంచి జరగాలని కోరుకుంటూ.. ఒక రోజు ముందుగానే పింఛను సొమ్ము అందిస్తున్నాం. పేదల జీవితాలకు ఆర్థిక భరోసా కల్పించే పింఛను పంపిణీ మాకు అత్యంత సంతృప్తిని కలిగించే సంక్షేమ కార్యక్రమం’ అని పేర్కొన్నారు.