AP: నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం మద్దూరులోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో అపచారం జరిగింది. ఆలయంలో స్వామివారి వెండి ఆభరణాలు మాయమయ్యాయి. వైకుంఠ ఏకాదశి రోజున నకిలీ వెండి ఆభరణాలతో స్వామివారిని అలంకరించారు. వెండి ఆభరణాలు మాయంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, వెండి ఆభరణాలు మాయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.