KNR: ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల మాయలో పడి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కొత్తపల్లి మండల కేంద్రానికి చెందిన తోట ఆదిత్య (34) బెట్టింగ్ సమస్యలతో మనస్తాపం చెంది తన ఇంట్లోనే ఉరివేసుకున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.