KDP: చారిత్రక, పర్యాటక, సాంస్కృతిక వైభవాన్ని విశ్వ వ్యాప్తం చేసేలా గండికోట ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా పర్యాటక శాఖ, ఏపీటీడీసీ అధికారులతో ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.