కడప: సిద్ధవటం మండలంలో పొగ మంచు ఊటీని తలపిస్తోంది. పలు గ్రామాలను బుధవారం పొగ మంచు కమ్మేసింది. మాధవరం-1లో ఉదయం 8 గంటలైనప్పటికీ సూర్యుడు కనిపించలేదు. వాహనదారులు లైట్లు వేసుకొని ప్రయాణం సాగిస్తున్నారు. పొగ మంచుతో వాహనదారులు కొంత ఇబ్బంది పడ్డారు. వృద్ధులు, పిల్లలు చలి తీవ్రతకు ఇంట్లో నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు.