AP: అమరావతి-అనంతపురం హైవేపై ప్రమాదం జరిగింది. రంగారెడ్డిపల్లి సమీపంలో గుర్తు తెలియని వాహనాన్ని డీసీఎం ఢీకొట్టింది. దీంతో డీసీఎంలో మంటలు చెలరేగి ఒకరు సజీవ దహనం కాగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు అనంతపురం జిల్లాకు చెందిన వెర్రిస్వామి, క్షతగాత్రుడు జయరామి రెడ్డిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.