MDCL: మేడ్చల్ జిల్లాలో రైతుల అవసరాలకు సరిపడా 773 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ మనూ చౌదరి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి కౌంటర్ వద్ద యూరియా సరఫరా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన లేకుండా అవసరమైన మేరకు యూరియాను పొందవచ్చని జిల్లా కలెక్టర్ భరోసా ఇచ్చారు.