BPT: జిల్లాలో న్యూ ఇయర్ వేడుకలపై ఎస్పీ ఉమామహేశ్వర్ ఆంక్షలు విధించారు. ప్రజలు ఇతరులకు ఇబ్బంది కలగకుండా ప్రశాంతంగా వేడుకలు జరుపుకోవాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేడుకల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన మంగళవారం వెల్లడించారు.