ADB: ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయాలు ఎంతో గొప్పవని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ అన్నారు. ఆదివాసీల ఆరాధ్య దైవం జంగుబాయి జాతర వేడుకల్లో మంగళవారం ఆయన పాల్గొని ఆదివాసీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆచార, వ్యవహారాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. బీజేపీ నాయకులు గంగాధర్ రావు, తుకారాం, చంద్రహరి, నాగరాజు, తదితరులున్నారు.