2026 T20 వరల్డ్ కప్ నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. దిగ్గజ పేసర్ లసిత్ మలింగను తమ జట్టుకు కన్సల్టెంట్ పేస్ బౌలింగ్ కోచ్గా నియమించింది. భారత్తో పాటు సొంతగడ్డపై జరిగే ఈ టోర్నీలో మలింగ అనుభవం, నైపుణ్యం జట్టుకు ఎంతో ఉపయోగపడతాయని SLC భావిస్తోంది. కాగా 2014 WC విజేతగా నిలిచిన అనంతరం.. గత 4 ఎడిషన్లలో లంక నాకౌట్ దశకు కూడా చేరుకోలేకపోయింది.