SKLM: ఎల్.ఎన్.పేట మండలంలోని రైతులు యూరియా కోసం ఆందోళన చెందవద్దని మండల ఏవో కిరణ్ వాణీ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలను ఆమె తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. 40 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపామన్నారు. సానుకూలంగా స్పందించారని త్వరలో రైతు సేవా కేంద్రాలకు 40 మెట్రిక్ టన్నుల యూరియా వస్తుందని ఏవో అన్నారు.