జర్మనీలోని ఓ బ్యాంకులో దుండగులు భారీ దోపిడీకి పాల్పడ్డారు. గెల్సెన్కిర్చెన్ నగరంలో బ్యాంకులోని 3,200 సేఫ్టీ డిపాజిట్లను దొంగలు పగలగొట్టారు. ఇందులోని నగదు, బంగారు ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. వీటి విలువ 30 మిలియన్ యూరోలు (రూ.316 కోట్లు) పైన ఉంటుందని అంచనా వేశారు. దాదాపు 2,500 మంది ఖాతాదారుల సొమ్ము చోరీకి గురైనట్లు గుర్తించారు.