BHPL: కాటారం మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలను మంగళవారం డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ (DAO) బాబు రావు తనిఖీ చేశారు. దుకాణాల్లో అందుబాటులో ఉన్న యూరియా నిల్వలను FIVES యాప్ ద్వారా ధృవీకరించారు. స్టాక్ రిజిస్టర్లు,విక్రయ వివరాలు,బిల్లింగ్ ప్రక్రియలను పరిశీలించి ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలను పాటిస్తూ ఎరువుల సరఫరా పారదర్శకంగా జరగాలని సూచించారు.