వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో భక్తులకు అందుతున్న సౌకర్యాలపై TTD ఛైర్మన్ BR నాయుడు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా భక్తులతో మమేకమై ఏర్పాట్లపై ఆరా తీశారు. ఇందుకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఏర్పాట్లు చేశారని, ఎక్కడా ఇబ్బంది లేకుండా స్వామిని దర్శించుకున్నామని భక్తులు తెలిపారు. క్యూలైన్లలో తాగునీరు, పాలు, అన్నప్రసాదాలు అందించడంపై హర్షం వ్యక్తం చేశారు.