AP: ప్రకాశం జిల్లా పొదిలి ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. వ్యాపారితో పోలీసుల ఘర్షణ ఘటనపై చర్యలకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై పూర్తి విచారణ జరపాలని.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశించారు. అయితే, ఎస్ఐని ఇప్పటికే వీఆర్‌కు పంపినట్లు సీఎంకు అధికారులు వివరించారు. ప్రజల గౌరవానికి భంగం కలిగేలా ఎవరూ ప్రవర్తించొద్దని చంద్రబాబు పేర్కొన్నారు.