HYD: న్యూ ఇయర్ వేడుకల వేళ డ్రంక్ అండ్ డ్రైవ్ పట్ల కఠినంగా వ్యవహరిస్తామని సైబరాబాద్ జాయింట్ సీపీ గజరావ్ భూపాల్ హెచ్చరించారు. ర్యాష్ డ్రైవింగ్, రేసింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ పట్ల ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. జీరో యాక్సిండెంట్ ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. సైబరాబాద్ వ్యాప్తంగా 140 ఈవెంట్లకు అనుమతి ఇచ్చినట్లు పేర్కొన్నారు.